సంగారెడ్డి సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో పంటలు, రోడ్లు, ఇండ్లు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. పలుచెరువులు, కుంటలకు బుంగలుపడ్డాయి. జిల్లాలోని జలవనరుల్లోకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరింది. సింగూరుప్రాజెక్టులోకి వరద కొనసాగుతుండగా నల్లవాగు ప్రాజెక్టు అలుగు పారుతుంది. జిల్లాలోని 117 చెరువులు అలుగు పారుతున్నాయి. మంగళవారం జిల్లాలో 1.6 సెం.మీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. సిర్గాపూర్‌లో అత్యధికంగా 8.6 సెం.మీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని 12 మండలాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురవగా 14 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
నల్లవాగు, సింగూరులోకి వరద
సింగూరు ప్రాజెక్టులోకి వరద కొనసాగుతుండగా నల్లవాగు ప్రాజెక్టు అలుగు పారుతుం ది. పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టులోకి 33,920 క్యూసెక్కుల నీరు వచ్చిం ది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 21. 536 టీఎంసీలకు చేరుకుంది. నల్లవాగు ప్రా జెక్టు పూర్తిస్థాయిలో నీటిమట్టం నిండి అలు గు పారుతుంది. జిల్లాలో 1769 చెరువులు ఉండగా 117 అలుగు పారుతున్నాయి. 32 1 చెరువులు పూర్తిగా నిండగా 366 చెరువులు 75 శాతం, 844 చెరువులు 50శాతం నిండాయి. సిర్గాపూర్ మండలం కడ్పల్‌లోని పులాయికుంట, సిర్గాపూర్‌లోని సాకిచెరువు, కల్హేర్ మండలం మహాదేవ్పల్లిలోని నర్స య్య చెరువులకు బుంగలుపడ్డాయి.
1625 ఎకరాల్లో పంట నష్టం
సంగారెడ్డి జిల్లాలోని 11 మండలాల్లోని 33 గ్రామాల్లో 1625 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. 20 ఎకరాల్లో వరి, 795 ఎకరా ల్లో సోయాబీన్, 170 ఎకరాల్లో మినుము, 51 ఎకరాల్లో పెసర పంటలు దెబ్బతిన్నా యి. 226 ఎకరాల్లో కంది, 298 ఎకరాల్లో పత్తి, 17 ఎకరాల్లో చెరుకు, 48 ఎకరాల్లో కూరగాయ పంటలకు నష్టం జరిగింది. జహీరాబాద్, నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గాల్లో 683.76 ఎకరాల్లో పం చాయతీరాజ్, ఆర్‌ఆండ్‌బీ రోడ్లు, 83 విద్యు త్ స్తంభాలు దెబ్బతిన్నాయి.
మున్సిపాలిటీల్లో పలు గ్రామాలు విలీనం
పటాన్చెరు, సెప్టెంబర్ 3: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాలను సమీపంలోని మున్సిపాలిటీల్లోకి విలీ నం చేస్తూ మంగళవారం ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పటాన్చెరు మండలంలోని ముత్తంగి, కర్ధనూర్, పోచారం, పాటి, ఘనపూర్ గ్రామాలను తెల్లాపూర్ మున్సిపాలిటీలో, అమీన్‌ఫూర్ మండలంలోని ఐలాపూర్ తండా, ఐలాపూ ర్, పటేల్‌గూడ, దాయర, కృష్టారెడ్డిపేట్, సుల్తాన్‌పూర్‌ను అమీన్‌ఫూర్ మున్సిపాలిటీలో విలీనం చేశా రు. పటాన్చెరు మండలంలోని ఐదు గ్రామాలు, అమీన్‌ఫూర్ మండలంలోని ఆరు గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. మున్సిపల్ అధికారులకు పంచాయతీ రికార్డులు వెళ్తున్నాయి. డీనోటిఫై చేస్తూ పంచాయతీరాజ్‌శాఖ నుంచి ఉత్తర్వ్యులు జారీ అయ్యాయి.