PM Modi : ఇరాన్ (Iran) తో ఇజ్రాయెల్-అమెరికా (Israel-US) చేస్తున్న యుద్ధం కారణంగా పశ్చిమాసియా (West Asia) లో నెలకొన్న ఉద్రిక్తతలపై భారత ప్రభుత్వం (Indian Govt) తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ప్రస్తుత పరిస్థితులపై ఇజ్రాయెల్ ప్రధాని (Israel PM) బెంజామిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) తో ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) ఫోన్లో మాట్లాడారు.
యుద్ధం వేళ పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇజ్రాయెల్ ప్రధానిని కోరారు. అదేవిధంగా ఇరాన్‌తో ఘర్షణలను సాధ్యమైనంత త్వరగా ముగించాలని సూచించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరాం. అలాగే ఘర్షణలను సాధ్యమైనంత త్వరగా ముగించాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించాం’ అని మోదీ తన పోస్టులో పేర్కొన్నారు.
ఇదిలాఉంటే ఆదివారం రాత్రి భద్రతావ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీ జరిగింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించారు. ఇది దేశ భద్రత, వ్యూహాత్మక అంశాలపై నిర్ణయం తీసుకునే అత్యున్నత కమిటీ. పశ్చిమాసియాలో ఘర్షణల వల్ల తలెత్తిన పరిణామాలపై ఈ భేటీలో చర్చించారు.