‘చేనేత రుణమాఫీ నిధులను వెంటనే విడుదల చేయాలి’
ఎన్నికలలో చేనేతల రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత దానిని రూ.లక్షకు కుదించి చేనేతల పట్ల చిన్నచూపు చూస్తున్నారని బీఆర్ఎస్ గట్టుప్పల్ మండల కన్వీనర్ ఇడం కైలాసం అన్నారు.
గట్టుప్పల్, మార్చి 02 : ఎన్నికలలో చేనేతల రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత దానిని రూ.లక్షకు కుదించి చేనేతల పట్ల చిన్నచూపు చూస్తున్నారని బీఆర్ఎస్ గట్టుప్పల్ మండల కన్వీనర్ ఇడం కైలాసం అన్నారు. సోమవారం గట్టుప్పల్ మండల కేంద్రంలో చేనేత కార్మికులతో సమావేశమై మాట్లాడారు. ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీ కూడా పట్టణ ప్రాంతాలకే పరిమితం చేసి గ్రామీణ ప్రాంత చేనేత కార్మికులకు ఇవ్వలేదని మండిపడ్డారు. వెంటనే రుణ మాఫీ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అదేవిధంగా చేనేత భరోసా, త్రిఫ్ట్ ఫండ్ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. వెంటనే విడుదల చేయకపోతే త్వరలో ఉద్యమ బాట పడతామని అందులో భాగంగా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడతామన్నారు. అనంతరం చేనేత మగ్గాలను పరిశీలించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు గంజి పెద్దలు, బడుగు తిమ్మయ్య, నామని గణేశ, రవ్వ రాములు, సూరేపల్లి బుచ్చయ్య, పులిపాటి వెంకటేశం, పెదగాని రాములు, చెరిపల్లి రమేశ్, గుర్రం రాఘవేంద్ర పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

