అచ్చంపేట రూరల్, సెప్టెంబర్ 3 : దుందుభీ వాగులో చేపలవేటకు వెళ్లి నీటిలో చిక్కుకున్న 12 మంది చెంచుల ను నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల రెస్క్యూ టీం రెండు రోజులు శ్రమించి గజ ఈతగాళ్ల సాయంతో ప్రాణాపాయం నుంచి రక్షించారు. ఇందుకు సంబంధించి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృ ష్ణ వివరాలు వెల్లడించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మం డలం బొమ్మనపల్లి-సిద్దాపూర్ శివారులోని గుర్రలబండ సమీపం లో వాగులో నల్లగొం డ జిల్లా డిండి మండలం గోనబోయినపల్లికి చెందిన 12 మంది (ఆరుగురు పురుషులు, నలుగురు స్త్రీలు, ఇద్దరు చి న్నారులు) చెంచులు జీవనాధారమైన చేపల వేటకు వెళ్లారన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోనబోయినపల్లి వైపు వాగు ఒక్కసారిగా ఉధృతంగా పారడంతో వారంతా గుర్రాలబండ వద్ద ఎత్తైన్న బండపైకి ఎక్కి తమ బంధువులకు సమాచారమిచ్చారన్నారు.
చెంచుల బంధువులు ఈ విషయాన్ని సోమవారం రాత్రి పోలీసులకు తెలుపడంతో అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాస్ స్థానిక యువకుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి కావడంతో వారికి సహాయం అందించేందుకు వీలుకాలేదు. మంగళవారం ఉదయం అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కు డు వంశీకృష్ణ, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయ క్ ఘటన సమీప ప్రాంతానికి చేరుకొని నాగర్‌కర్నూల్, నల్లగొండ ఎస్పీలు వైభవ్ రఘునాథ్ గైక్వాడ్, శరత్ చంద్రపవార్కు సమాచారం అందించారు.
ఎస్పీలు అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు, దేవరకొండ డీఎస్పీ గిరిబాబు, ఎస్సై లు రాములు, పవన్‌కుమార్, రాజుతోపాటు 50మంది రెస్క్యూ టీం, అగ్నిమాపక శాఖ సిబ్బం ది, గజఈతగాళ్ల సా యంతో తాళ్లు, పుట్టీ ల సహకారంతో నీటి లో చిక్కుకున్న 12 మంది చెంచులను ఎ లాంటి ప్రాణాపా యం లేకుండా సంరక్షించారు. దీంతో ఎ మ్మెల్యే పోలీసులు, అగ్నిమాపక శాఖ, గ జ ఈతగాళ్లను అభినందించారు. చెంచులకు ఆహారం అందించి చికిత్స కోసం అచ్చంపేట వంద పడకల ఏరియా దవాఖానకు తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి మందులు అందజేశా రు. అనంతరం ఇద్దరు ఎమ్మెల్యేలు డిండి ప్రాజెక్టును రైతులతో సందర్శించి మైసమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.