Farmers Protest | యూరియా యాప్‌ను వ్యతిరేకిస్తూ నల్గొండ జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. పీఏపల్లి మండలం అంగడిపేటలో నాగార్జునసాగర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు.
‘పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ మంచిగుండె.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక తెచ్చిన యాప్‌తో తిప్పలు పడుతున్నాం’ అని రైతులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. యాప్‌లో బుక్ చేద్దామంటే ఓటీపీ రావడం లేదని, అది వచ్చే సరికి ఉన్న స్టాక్ అయిపోయితుందని మండిపడుతున్నారు. యాప్ విధానాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఆందోళన చేపట్టారు.