జగిత్యాల : జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ ( Operation Muskaan ) విజయవంతమైందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ( SP Ashok Kumar ) తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు తప్పిపోయిన, విడిచిపెట్టబడిన చిన్నారులను గుర్తించి వారి కుటుంబాలకు చేర్చే లక్ష్యంతో నిర్వహిస్తున్న అనుకున్న లక్ష్యాలను అన్ని శాఖల సమన్వయంతో సాధించిందన్నారు.
జిల్లాలో 63 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించినట్లు తెలిపారు. బాలల సంరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతి సంవత్సరం రెండు సార్లు ఆపరేషన్ స్మైల్ , ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూలై 1 నుంచి జూలై 31 వరకు జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్చేపట్టినట్లు వెల్లడించారు.