Rashmika Mandanna : టాలీవుడ్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు హీరోలు అనుకోకుండా ఆస్పత్రి పాలవ్వగా.. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) సైతం గాయపడింది. ‘మైసా’, ‘రణబాలి’ చిత్రాలతో బిజీగా ఉన్న రష్మిక షూటింగ్లో యాక్షన్, నృత్య సన్నివేశాలు తెరకెస్తుండగా తీవ్రంగా గాయపడింది. సత్వరం చికిత్స అందించి.. ఆమెకు పూర్తిగా ఆరు వారాలు విశ్రాంతి సూచించారు డాక్టర్లు. దాంతో, తెలుగింటి కోడలు కొన్ని వారాలు షూటింగ్‌కు దూరం కానుంది.
‘గీతగోవిందం’, ‘పుష్ప’, ‘గర్ల్‌ఫ్రెండ్’ ఫేమ్ రష్మిక మందన్నా షూటింగ్ సమయంలో గాయపడింది. మైసా, రణబాలి చిత్రాల కోసం కష్టమైన యాక్షన్, నృత్య సన్నివేశాలు తీస్తుండగా రష్మిక గాయపడింది. దాంతో, వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. రష్మికను పరీక్షించిన వైద్యులు గాయం తీవ్రత పెద్దదేనని, కనీసం ఆరువారాలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
Injuries continue to haunt Tollywood! Now reports indicate that #Rashmika is injured.
Rashmika Mandanna experienced a total hip tendon detachment during the filming of a dance sequence.
She was reportedly advised six weeks of complete rest and rehabilitation, noting severity… pic.twitter.com/o0htFMF0Xt
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) July 31, 2026
మామూలుగా అథ్లెట్లలో కనిపించే టిండాన్ గాయం రష్మికలో చూసి వైద్యులు షాకయ్యారు. ఇంజూరీ తీవ్రత దృష్ట్యా ఆమెకు ఆరు వారాల విశ్రాంతితో పాటు.. రిహాబిలిటేషన్ తప్పనిసరని వెల్లడించారు. దాంతో.. మైసా, రణబాలి షూటింగ్ నుంచి తను బ్రేక్ తీసుకోనుంది.
Rashmika Mandanna Suffers Serious Injury While Filming Dance Sequence
Actress Rashmika Mandanna has sustained a serious injury while filming a dance sequence.
The actress, who is currently shooting for Ranabali and Mysa, reportedly suffered a complete tendon detachment in her…
— idlebrain jeevi (@idlebrainjeevi) July 31, 2026