కాంగ్రెస్ అరాచక పాలనకు నిరసన.. తాండూర్‌లో కొనసాగుతున్న బంద్
మంచిర్యాల జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన చేస్తోందని తాండూర్ మండల బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అరెస్టుకు నిరసనగా గురువారం చేపట్టిన జిల్లా బంద్ తాండూర్ మున్సిపాలిటీలో సంపూర్ణమైంది.
తాండూర్, ఫిబ్రవరి 19 : మంచిర్యాల జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన చేస్తోందని తాండూర్ మండల బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అరెస్టుకు నిరసనగా గురువారం చేపట్టిన జిల్లా బంద్ తాండూర్ మండలంలో సంపూర్ణమైంది. పలు వ్యాపార సంస్థలతో పాటు ప్రైవేటు విద్యాసంస్థలు బంద్ పిలుపునకు స్వచ్ఛందంగా మద్దతునిచ్చారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం బీఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలో పర్యటించి నిరసన తెలిపారు.
అనంతరం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. క్యాతనపల్లిలో బీఆర్ఎస్కు ప్రజలు సంపూర్ణ మెజారిటీ ప్రకటించారని తెలిపారు. కానీ కేవలం ఏడు స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ.. తన అధికార బలంతో అరాచకాలు సృష్టిస్తూ అడ్డదారిలో మున్సిపల్ పీఠం కోసం కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దీన్ని అడ్డుకున్న బాల్క సుమన్‌పై లేనిపోని సెక్షన్లతో అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నాయకుల అరాచకాలు, కుయుక్తులను ప్రజలు గమనిస్తున్నారని.. వారికి తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపుతో స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ మండల అధ్యక్షుడు సుబ్బా దత్తుమూర్తి, మాజీ ఎంపీపీ పూసాల ప్రణయ్ కుమార్, నాయకులు దత్తాత్రేయ రావు, బోనగిరి చంద్రశేఖర్, ఎలుక రామచందర్, మొగిలి శంకర్, మాసాడి శ్రీరాములు, పురుషోత్తం గౌడ్, గట్టు సంతోష్ కుమార్, భీమ లింగయ్య, అడువాల సత్యనారాయణ, పెరిక రాజన్న, బోడ సతీష్, జాడి పోశం, చింటూ, బాబుఖాన్, క్రాంతి కుమార్, రాజేందర్, చోధన్ పెద్ద ఎత్తున కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | కొడంగల్ నిర్వాసితులకు ఒక న్యాయం.. వనపర్తి నిర్వాసితులకు మరో న్యాయమా? : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో భారీ ఉద్యోగాల కోత.. 5 శాతం సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు!
Tragedy | పాకాల బీచ్‌లో విషాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరు గల్లంతు
ఎంవి పాలెం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

