Hyderabad | హైదరాబాద్లో దారుణం జరిగింది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బాలికకు గంజాయి తాగించి, మత్తులో ఉండగా ముగ్గురు రౌడీషీటర్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
ప్రస్తుతం బాధితురాలికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.