కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న భా రీ వర్షాలు పలు మండలాల్లో భారీ నష్టాన్ని మిగిల్చాయి. వరదల ధాటికి పంటలు కొట్టుకపోగా కల్వర్టులు, రోడ్లు ధ్వంసమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వ ర్షాలతో రోజుల తరబడి పంటలు నీట మునిగే ఉన్నాయి. దీంతో మొ క్కలు జాలు పట్టి రైతులకు తీరని నష్టం కలిగింది.
జూలై చివరి వారం లో కురిసిన వర్షాలతో జిల్లాలో దాదాపు 12 వేల ఎకరాల్లో పంటలకు నష్టం కలిగింది. గత మూడు రోజులుగా కురిసిన వర్షాలతో జిల్లాలో 900 ఎకరాల్లో పత్తి, 300 ఎకరాల్లో మిరప పంటలు దెబ్బతిన్నాయి. వట్టివాగు, కుమ్రం భీం ప్రాజెక్టుల్లోకి వస్తున్న వరద నీటిని పెద్ద ఎత్తున పెద్దవాగులోకి వదిలివేయడంతో పెద్ద వాగులో ఉధృతి పెరిగి పరివాహక ప్రాంతాల్లో ఉన్న పంటలు దెబ్బతిన్నాయి.
10 టీఎంసీల సామ ర్థ్యం ఉన్న కుమ్రం భీం ప్రాజెక్టు కట్ట దెబ్బతినడంతో అధికారులు ప్రా జెక్టుని ఐదు టీఎంసీల సామర్థ్యానికే పరిమితం చే శారు. దీంతో వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి వస్తున్న వరద నీటిని వెంట వెంటనే గేట్లు తెరిచి దిగువకు వదులుతున్నారు. దీంతో భారీ వర్షాలతో వాగులు ఉధృతంగా ప్రవహించడంతో సమీపంలోని పంట పొలాలు దెబ్బతినడంతోపాటు కల్వర్టులు, రోడ్లు ధ్వంసమయ్యాయి. జి ల్లాలో 14 కల్వర్టులు పూర్తిగా ధ్వంసం కాగా మరో 10 వరకు తాత్కాలికంగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు.
15 రహదారులు ధ్వంసమైనట్లు అం చనావేశారు. కాగజ్నగర్ డివిజన్లోని కాగజ్నగర్, దహెగాం, బెజ్జూ ర్, పెంచికల్పేట్, సిర్పూర్-టీ మండలాల్లోని వాగు పరివాహక ప్రాం తాల్లో పంటలకు తీవ్రమైన నష్టం కలిగింది. మారుమూల ప్రాంతాల్లోని రోడ్లు, కల్వర్టులు దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నా యి. వర్షాలతో గ్రామాల్లో ఏర్పడిన అపరిశుభ్రత కారణం గా సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది.
మంచిర్యాల జిల్లాలో 805 ఎకరాల్లో పంట నష్టం
మంచిర్యాల (ఏసీసీ), సెప్టెంబర్ 4: అకాల వర్షాలతో ప్రాథమిక అంచనా మేరకు జిల్లా వ్యాప్తంగా దాదాపు 805 ఎకరాల పంట నష్టం జరినట్లు వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 520 ఎకరాల్లో పత్తి, 285 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. వర్షాలు తగ్గిన తర్వాత జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి కచ్చితమైన వివరాలు నమోదు చేస్తామని తెలిపారు. అనంతరం వాటిని నివేదిక రూపంలో పొందుపరిచి, పై అధికారులకు నివేదిస్తామని వెల్లడించారు. జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో గేట్లు ఎత్తివేశారు. పలు వాగులు, వంకలు పొంగి పొర్లడంతో జిల్లా వ్యాప్తంగా వందలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి.