మేడారం ఆదివాసీ మ్యూజియంలో ఈనెల 21నుంచి 23 వరకు కోయ గిరిజనుల ఇలవేల్పుల సమ్మేళనం మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు పెసా జిల్లా కో ఆర్డినేటర్ ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.
వనదేవతలు సమ్మక్క-సారలమ్మ మేడారం జాతరకు 67 ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు హుస్నాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో జాతర బస్సుల కోసం ఏర్పాటు చేసిన ప్ర�
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించి ప్రభుత్వ రవాణా వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకాన్ని కలిగించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మేడారం జాతరకు కామారెడ్డి ఆర్టీసీ డిపో నుంచి ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు 58 ప్రత్యేక సర్వీసులను నడిపిస్తున్నామని మేనేజర్ ఇందిర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు వచ్చే భక్తులకు రోజు రోజుకూ సౌకర్యాలు మెరుగు పడుతున్నాయి. ప్రస్తుత సాంకేతిక యుగంలో ప్రతి విషయాన్ని ఆన్లైన్లో సెల్‌ఫోన్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది.
వనదేవతలు కొలువైన మేడారం జాతర పరిసరాలు జన సంద్రాన్ని తలపించాయి. ఆదివారం లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో అటవీ ప్రాంతం జనారణ్యంగా మారింది. రోజంతా భక్తుల రాకపోకలతో మేడారం దారులు కిక్కిరిసిపోయాయి.
మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరలో సేవాభావంతో విధులు నిర్వర్తించి, భక్తులకు రవాణా పరంగా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు.
మేడారం మహాజాతర అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు శనివారం మేడారంలో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు.
మేడారం మహాజాతరలో భక్తుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఇలాత్రిపాఠి తెలిపారు. మేడారం ఐటీడీఏ క్యాంపులో కంట్రోల్ రూంను కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు.
మేడారం మహాజాతర కు భక్తుల సౌకర్యార్థం పర్యాటకశాఖ హెలికాప్టర్ సేవలు ఈసారి కూడా ప్రారంభించనున్నది. హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ నుంచి మేడారానికి భక్తులను తరలించి దర్శనం తర్వాత తిరిగి హనుమకొండకు తీసుకె�
మేడారం సమ్మక్క-సారలమ్మకు భక్తులు నిలువెత్తు బంగారం(బెల్లం) ఇచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. కానీ, వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని మంగళవారిపేట గ్రామానికి చెందిన దబ్బెట ఉపేందర్-నాగలక్ష్మి దంపత
వన జాతర మేడారానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. మహా జాతరకు మరో ఆరురోజులే ఉండడంతో తల్లులకు ముందస్తు మొక్కులు చెల్లిస్తున్నారు. వరాలిచ్చే సమ్మక్క-సారలమ్మలను దర్శించుకొని దీవెనలు పొందుతున్నారు.
: మేడారం ట్రస్ట్ బోర్డులో ఆదివాసేతరులను తొలగించాలని, లేకుంటే ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటామని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బగట్ల సుమన్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.
మేడారంలో బుధవారం మండెమెలిగే పండుగను సమ్మక్క-సారలమ్మ పూజారులు ఘనంగా నిర్వహించారు. మొదటగా సమ్మక్క పూజా మందిరంలో తల్లి గద్దెను, పూజా సామగ్రిని పూజారులు సిద్ధబోయిన మునీందర్, కృష్ణయ్య శుద్ధి చేశారు.