ములుగు, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): మేడారం మహాజాతర అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు శనివారం మేడారంలో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. ఈమేరకు శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ఇలా త్రిపాఠి ఏర్పాట్లను పరిశీలించారు.
తల్లుల గద్దెల ప్రాంగణం, మీడియా పాయింట్, హరిత హోటల్, ఆర్టీసీ బస్టాండ్, పరిసర ప్రాంతాల్లో ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డీవో సత్యపాల్‌రెడ్డి, డీపీవో వెంకయ్య, తహసీల్దార్ రవీందర్, డీపీఆర్వో రఫిక్, పీఆర్ ఏఈ అజిత్ ఉన్నారు.