తాడ్వాయి, ఫిబ్రవరి 16: మేడారం మహాజాతరలో భక్తుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఇలాత్రిపాఠి తెలిపారు. మేడారం ఐటీడీఏ క్యాంపులో కంట్రోల్ రూంను కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తితే సాయం పొందేందుకు 1800-425-0620ను సంప్రదించాలని కోరారు.
ఈ నంబర్ 19నుంచి అందుబాటులో ఉంటుందన్నారు. 382 సీసీ కెమెరాలతో కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అదనపు కలెక్టర్లు శ్రీజ, వేణుగోపాల్, ఈడీఎం దేవేందర్, డీపీఆర్వో రఫిక్ ఉన్నారు.