వరంగల్ : కాంగ్రెస్ పాలనలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన యువ రైతు సంకినేని సాంబరాజు (33) అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. వ్యవసాయం, కుటుంబ అవసరాల కోసం అప్పులు కావటంతో వాటిని తీర్చలేక మనస్థాపానికి గురై తన వ్యవసాయ పొలంలో ఈనెల 8వ తేదీన గడ్డిమందు తాగాడు.
గమనించిన కుటుంబ సభ్యులు సాంబరాజును హనుమకొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. కాగా, చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మృతిడికి భార్య, పిల్లలు ఉన్నారు. సాంబరాజు మృతితో కుంటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.