ఖానాపురం, ఫిబ్రవరి 14: మేడారం సమ్మక్క-సారలమ్మకు భక్తులు నిలువెత్తు బంగారం(బెల్లం) ఇచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. కానీ, వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని మంగళవారిపేట గ్రామానికి చెందిన దబ్బెట ఉపేందర్-నాగలక్ష్మి దంపతులు తమ పదేళ్ల పెంపుడు కుక్క నిలువెత్తు బంగారాన్ని వనదేవతలకు సమర్పించేందుకు మొక్కుకున్నారు.
ఈ మేరకు బుధవారం కిరాణా షాపులో కుక్కను త్రాసులో కూర్చోబెట్టగా 8 కిలోల బంగారం తూగింది. శుక్రవారం కుటుంబ సమేతంగా మేడారం వెళ్లి తల్లులకు బంగారం సమర్పించనున్నట్లు వారు తెలిపారు.