సునిశిత విమర్శకు పేరున్న వంశీకృష్ణ వర్తమాన విమర్శ చుట్టూ వ్యాసాన్ని నడిపి సినిమా హీరోలకి మల్లే కవులకి ఇమేజి సమస్యలున్నాయేమో అని వాపోవడం (చెలిమె 20.01.25) ఆశ్చర్యం వేసింది. ఆ పోలికే అసమంజసంగా ఉంది.
ఏండ్లనాటి ఏదైతే ఒక వృక్షం
తన ఎండుటాకులను రాల్చుకున్నట్టు
మసక వెలుతురులోని మసిబారిన
ఆ గ్రంథాలయపు గది గోడలు
ఎదురుగా పుస్తకాల్లోని బిల్వ
పత్రాలను రాల్చుకుంటున్నాయ్.
మన కాలి బొటనవేళ్లని తాళ్లతో ముడివేసి ఆ రెంటి మధ్యలోంచి జీవితాలను చూస్తున్న కవి ఒకరున్నారు. అప్పుడెప్పుడో ఆ పని బైరాగి చేశారు. తక్కువే రాసినా అద్భుత కవిత్వాన్ని పంచిన అజంతా కూడా ఇంచుమించు సరిసాటి అనిపించ