వణికించిన చలికాలం వేడెక్కి
మనతో డీడిక్కులాడటమే వేసవి
స్వెట్టర్లు శాలువాలు
మంకీ క్యాంపులు పోయి
ఒంటి మీద బనీను కూడా
బరువై పోవడం వేసవి
వేసవి అంటే
అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్యల ఊర్లు గుర్తురావడం
జ్ఞాపకాల మల్లెల
ముల్లెలతో
మన పల్లెలు మనలను
రమ్మని తీయగా పిలవడమే
వేసవికాలం
ఆట పాటలకు నెలవులు
మన మామిడి తోపులు
చెరుకు తోటలు
ఒక ఏడాది అలసటకు
ఆటవిడుపు
ఈ వేసవి కాలం
వేసవి సెలవులంటే
పిల్లలతో కలిసి
మనమంతా
మర్ల పోరగాండ్లమై పోవడమే
– వీపీ చందన్రావు
94400 38565