రంగుల కలలన్నీ
రాత్రంతా పహారా కాశాయి
వెన్నెల జలపాతాల్లో
ఈదులాడి వచ్చింది మనసు
వెతలన్నీ వీడ్కోలు పలికాయని
దారంతా నక్షత్రాలు మెరుస్తుంటే
ఆశల వృక్షాలు స్వాగతమంటుంటే
కాలం కరిగిపోగా
కళ్ళు తెరిచాను
బాధ్యతల కావిడందుకుని
రాత్రి మైకాన్ని పుక్కిలించి
బతుకు బాట పట్టాను
నవ్వుకుంటూ…
– సీయస్ రాంబాబు
83748 18961