నాకు గ్యావ తెలిపినప్పటి నుంచి
అవ్వ మబ్బుల్నే నిద్ర లేచేది
నిద్రబోయిన ఆకలిని లేపి
శుభ్రంగా కడిగేసి బొట్టు పెట్టేది
రాత్రి పూసుకున్న బాసన్లకు తానం పోసి
వాటిని భద్రంగా శిక్కంలో శెక్కేది...
సునిశిత విమర్శకు పేరున్న వంశీకృష్ణ వర్తమాన విమర్శ చుట్టూ వ్యాసాన్ని నడిపి సినిమా హీరోలకి మల్లే కవులకి ఇమేజి సమస్యలున్నాయేమో అని వాపోవడం (చెలిమె 20.01.25) ఆశ్చర్యం వేసింది. ఆ పోలికే అసమంజసంగా ఉంది.