చలిని కసిగా తొక్కుకుంటూ వచ్చి
పిల్లాడు పేపరేసిపోయాడు
చలిని ఈడ్చి అవతల పారేసి
పారిశుద్ధ్య కార్మికులు రోడ్లు శుభ్రం చేసారు
చలిని శత్రువుల గుండెల్లో పుట్టిస్తూ
సైనికులు దేశాన్ని రక్షిస్తున్నారు
రాత్రంతా ఫుట్‌పాత్‌లపై
వెళ్ళమార్చిన అభాగ్యులు
ఏకంగా చలినే చలింపజేసారు
మా ఆవిడ చలికి మంటబెట్టి
నాకు టీ అందించింది
నేనేమో గుటకలేస్తూ ఉంటే
నాలోన వేళ్ళూనుకొని ఉన్న చలి
క్షణంలో మటుమాయమైపోయింది
-నలిమెల భాస్కర్
97043 74081