వెలుగులను మింగాలనుకున్న చీకటికి
నిరాశే మిగిలింది
సూర్యుణ్ణి మింగానని విర్రవీగిందో లేదో
తన కడుపునుండే పున్నమి వెలుగుల రూపేణా
పుడమిపై పుట్టేసరికి అవమాన భారంతో
ఉదయానికి ఆత్మహత్య చేసుకుంది
వసంతాన్ని చెరిచానని లోలోన
ముసి ముసిగా నవ్వుకుంటుంది శిశిరం
శిశిరపు నవ్వును సవాలు చేస్తూ విచ్చుకుంటుంది
అరుణారుణ మోదుగుపూల వనం
విప్లవం ప్రకృతి…
అంతాలు లేని అంకురాలు
నిరంతరం తమను తాము
పరిణామీకరించుకుంటూ ప్రయాణించడమే
వాటి అసలు రూపం…
వాటి నిర్మూలనే ఆలోచన
నిన్ను నీవే అంతమొందించుకునే
నీ ఆఖరి అమాయకత్వపు ప్రకటన
– దిలీప్.వి