పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. నగరంపై తీవ్ర ప్రభావాన్నే చూపిస్తున్నది. ఎల్పీజీ కొరతతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులుపడుతున్నారు. హోటల్ నిర్వాహకుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కొన్ని హోటళ్లు మూసివేయగా, మరికొన్ని వాటిల్లో మెనూలో మార్పులు చేస్తున్నారు. కొన్ని ఆహార పదార్థాల రేట్లను పెంచేస్తున్నారు.
మరికొందరు నిర్వాహకులు కట్టెల పొయ్యితో వంటలు చేస్తున్నారు. హాస్టళ్లలోనూ అవస్థలు తప్పడం లేదు. సందట్లో సడేమియాలా గ్యాస్ ఏజెన్సీలు ‘దండ’ యాత్ర మొదలుపెట్టాయి. కృత్రిమ కొరత చూపిస్తూ వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి. ‘నో స్టాక్’ బూచి చూపి.. ‘మేమడిగితనంత ఇస్తేనే సిలిండర్ సరఫరా’ అంటున్నాయి. వన్డే డెలివరీకి అదనంగా 2వేల వరకు వసూలు చేస్తున్నాయి. కమర్షియల్ సిలిండర్‌కు రూ. 5వేలు వరకు బాదేస్తున్నాయి.