అది గూడు కాదు
అమ్మమ్మ పావురం నింపుకున్న పొదివి
ఏడాదికో మారు వచ్చే
మనవళ్ల కోసం దాచే తాయిలాల గది
అందులో దాచేవి వెల లేనివే
కొత్త రుచుల జాడ ఆ నాలుగు అరలు
పెద్దోళ్ళ జిహ్వ చాపల్యానికి
తాళంతో సంకెళ్ళు వేయబడే చోటు
తాళం చెవి పుస్తెకి జోడుగా
జోరుగా హుషారుగా అమ్మమ్మ దరి చేరగా
సరాసరి ఆ గూడు తలుపులు
తెరవ సాగే అమ్మమ్మ
అందులోంచి ఏది ఇచ్చినా రుచే
మాగిన ప్రేమ ఫలం నోట్లో
మనసు రెక్కలు తొడుక్కుని ఎగురు!
-గిరి ప్రసాద్ చెలమల్లు
94933 88201