చెరువుల్లో రోజు రోజుకూ నీటి మట్టం తగ్గుతూ జలకళను కోల్పోతున్నాయి. గతంలో ఎండాకాలంలో సైతం నీటితో కళకళలాడిన చెరువులు మార్చి చివరి వరకు చెరువుల్లో నీళ్లు అడుగంటుతున్నాయి.
ఈ ఏడాది లోటు వర్షపాతం, ప్రాజెక్టుల్లో కరువైన నీటి లభ్యత కారణంగా జిల్లాలో భూగర్బ జలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. గత నెలలో 8.68 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ నీటి మట్టం.. ఈ నెలలో 10.06 మీటర్లకు పడిపోయింది.
వ్యవసాయ బోర్లలో భూగర్భ జలాలు వేగంగా పడిపో తున్నాయి. గత ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవకపోవడంతో బోర్లలో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. వ్యవసాయానికి గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం,