‘బోరు’మంటున్నాయ్..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్ మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరం నుంచే జీవనది ప్రాణహిత ఏడాదంతా ప్రవహిస్తూ ఉంటుంది. ప్రాణహిత పక్కనే ఉన్నా పొలాలకు మాత్రం నీటి చుక్క అందడం లేదు.
- ప్రాణహిత చెంతనే ఉన్నా.. చింత తప్పడం లేదు..
- జీవనది పక్కనే ఉన్నా చుక్కనీరు పడని బోరుబావులు
- 300-400 అడుగులు బోర్లు వేసినా కానరాని నీటి చుక్క
- పొలాల్లో విద్యుత్ లైన్లు ఉన్నా వినియోగించుకోలేని దుస్థితి
కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలం గాణ)/బెజ్జూర్, ఏప్రిల్ 18 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్ మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరం నుంచే జీవనది ప్రాణహిత ఏడాదంతా ప్రవహిస్తూ ఉంటుంది. ప్రాణహిత పక్కనే ఉన్నా పొలాలకు మాత్రం నీటి చుక్క అందడం లేదు. బెజ్జూర్ మండలంలో దాదాపు 30 మంది రైతులు 100కు పైగా బోర్లు వేశారు. 300-400 అడుగుల లోతుకు వేసినప్పటికీ ఒక్క బోరులో కూడా నీటి చుక్క కనిపిం చ లేదు. తమ ప్రాంతంలో సారవంతమైన భూములు ఉన్నప్పటికీ భూగర్భజలాలు లేక పోవడంతో కేవలం వర్షాధార పంటలకు మాత్రమే పరిమితం అవుతున్నామని రైతు లు పేర్కొంటున్నారు. మండలంలో గొల్ల బా యి చెరువు, స్ప్రింగానికల్ మత్తడి ఉన్నప్ప టికీ వీటి ద్వారా కూడా వర్షాకాలంలో తప్పా మిగతా కాలంలో నీరు అందడం లేదు.
బోరుబావిలోనికి ఆశగా చూస్తున్న రైతు నాగుల రవి. ఇతనిది కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం. ఇతనికి మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. వర్షాకాలం, యాసంగిలో పంటలు వేసుకోవాలని ఆశపడ్డాడు. తన చేనులో 300 అడుగుల చొప్పున మూడు బోర్లు వేశాడు. ఒక్కో బోరుకు లక్ష రూపాయల చొప్పున రూ.3 లక్షలు ఖర్చు చేశాడు. అయినప్పటికీ చుక్క నీరు పడలేదు. కేవలం వర్షాధార పంటకు మాత్రమే పరిమితం కావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
చిత్రంలో కనిపిస్తున్న రైతు ఏలేశ్వరం వెంకటయ్య. ఇతనిది కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం. తనకున్న ఐదెకరాల్లో మూడు బోర్లు వేశాడు. ఒక్క బోరులో కూడా నీళ్లు పడలేదు. ఇప్పటివరకు దాదాపు రూ.3లక్షలు ఖర్చు చేశారు. చివరకు చేసేదేమి లేక వర్షాధార పంటపైనే ఆధారపడుతున్నాడు. సారవంతమైన భూమి, గత ప్రభుత్వం తన పొలంలో నుంచి వేసిన ఉచిత విద్యుత్‌లైన్ ఉన్నా యాసంగి పంట పండించుకోలేని దుస్థితిలో ఉన్నాడు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

