పాతాళానికి గంగమ్మ
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యం చెందగా, భూగర్భ జలాలు అడుగంటి తాగు, సాగు నీటికి తండ్లాడాల్సి వస్తున్నది. కాళేశ్వరం కిందున్న ప్రాజెక్టులు నింపకపోవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని జలాశయాలు డెడ్‌స్టోరేజీకి చేరుకున్నాయి.
- డెడ్ స్టోరేజీకి ఉమ్మడి జిల్లాలోని జలాశయాలు
- శరవేగంగా పడిపోయిన భూగర్భ జలాలు
- గతేడాదితో పోలిస్తే భారీ వ్యత్యాసం
- సాగు, తాగు నీటికి తండ్లాడుతన్న ప్రజానీకం
- ఎండల తీవ్రత పెరిగితే సమస్య మరింత జఠిలం
- ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ సర్కారు వైఫల్యం
మంచిర్యాల, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యం చెందగా, భూగర్భ జలాలు అడుగంటి తాగు, సాగు నీటికి తండ్లాడాల్సి వస్తున్నది. కాళేశ్వరం కిందున్న ప్రాజెక్టులు నింపకపోవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని జలాశయాలు డెడ్‌స్టోరేజీకి చేరుకున్నాయి. ప్రాజెక్టుల నుంచి నీరు రాక.. కాల్వలు, చెక్ డ్యామ్‌లు నిండక బోర్ల వినియోగం విపరీతంగా పెరిగి గంగమ్మ తల్లి పాతాళానికి చేరుకున్నది. గతేడాది మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో భూగర్భ జలాల నీటిమట్టం భారీగా పడిపోయింది. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో దాదాపు 1.25 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. మంచిర్యాలలో 0.96, ఆసిఫాబాద్‌లో 0.56, ఆదిలాబాద్‌లో 0.19 మీటర్ల లోపలికి వెళ్లిపోయాయి.
ప్రాజెక్టుల్లో నీరు లేకే ఈ దుస్థితి..
భూగర్భ జలాలు పడిపోవడానికి ప్రధాన కారణం ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్టు, మంచిర్యాల జిల్లాను ఆనుకొని ఉన్న ఎల్లంపల్లి, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయిలో నీళ్లు ఉన్నాయి. దీంతో గతేడాది ఉమ్మడి జిల్లాలో గోదావరి నది నిండుకుండలా ప్రవహించింది. మండువేసవిలోనూ నీటితో కళకళలాడింది. ఫలితంగా ఈ జిల్లాలో భూగర్భ జలాలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడలేదు. కా నీ ఇప్పుడా పరిస్థితి లేదు.
అటు కడెం, ఇటు ఎల్లంపల్లి డెడ్‌స్టోరేజీకి చేరుకున్నాయి. కడెం కిందున్న ఆయకట్టుకు ఇప్పటికే క్రాప్ హాలిడే ప్రకటించగా, ఎల్లంపల్లిలో డెడ్‌స్టోరేజీలో ఉన్న నీటిని హైదరాబాద్ మెట్రో వాటర్ స్లపయ్కి, పెద్దప ల్లి, మంచిర్యాల జిల్లాల తాగునీటి అవసరాలకే వినియోగించుకోవాలని ఆదేశాలు వచ్చాయి. ఒకవేళ అంచనాలు తప్పి ఈ ప్రాజెక్టులు అడుగంటితే బోర్లమీద ఆధారపడి తా గునీరు సరఫరా చేయాల్సి వస్తుంది. గతేడాది ప్రాజెక్టుల్లో పుష్కలమైన నీరు ఉండడంతో బోర్లలో భూగర్భ జలాలు ఉబికివచ్చాయి. కానీ ఈ ఏడాది ప్రాజెక్టుల్లో నీరులేక భూగర్భ జలాలు రోజురోజుకూ పడిపోతూవస్తున్నాయి.
మండలాల్లో పాతాళానికి..
జిల్లా మొత్తానికి సగటున చూసినప్పుడు భూగర్భ జలాలు పడిపోయిన శాతం తక్కువగా ఉన్నా.. చాలా మండలాల్లో ఆందోళనకరమైన దుస్థితికి జలమట్టం పడిపోయింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో గతేడాది ఈ సమయానికి 25.10మీటర్ల లోతులో భూగర్భ జలాలు అందుబాటులో ఉండగా, ఈ ఏడాది 32.00మీటర్లలోతుకు అవి ప డిపోయాయి. ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్గూ డ ప్రాంతంలో 7.60మీటర్ల నుంచి 9.55మీటర్లకు పడిపోయాయి.
నిర్మల్ జిల్లాలో మామడ మండలంలోని కొన్ని ప్రాంతాల్లో గతేడాది 18.64 మీటర్లలోతులో ఉన్న జలా లు 36.62మీటర్లకు పడిపోయాయి. లోకేశ్వరంలో 10.53 మీటర్ల నుంచి 16.15 మీటర్ల లోపలికి వెళ్లిపోయాయి. తా నూర్, పెంబి, ముథోల్ సహా మిగిలిన మండలాల్లో రెండు మీటర్ల నుంచి ఐదు మీటర్ల వరకు భూగర్భ జలమట్టం పడిపోయింది. మంచిర్యాల జిల్లా నస్పూర్ ప్రాంతం లో 3.31 మీటర్ల నుంచి 9.80 మీటర్లకు, జన్నారంలో 2.67నుంచి 4.60, జైపూర్‌లో 16.29మీటర్ల నుంచి 21.10మీటర్లకు భూగర్భజలాలు పడిపోయాయి.
ఇక ఆసిఫాబాద్ జిల్లాలో రెబ్బెన మండలంలోని కొన్ని ప్రాంతాల్లో 6.70మీటర్ల నుం చి 9.72 మీటర్లకు, కాగజ్‌నగర్‌లో 14 మీటర్ల నుంచి 16.20మీటర్లకు భూగర్భ జలమట్టం తగ్గింది. ఉమ్మడి జి ల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే ఉన్నట్లు అధికారుల గ ణాంకాలు చెబుతున్నాయి. కాగా, ఇప్పటికే భూగర్భ జలా లు అడుగంటి సాగు, తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, ఎండల తీవ్రత పెరిగితే మరింత సమస్య జఠిలమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

