తాంసి, మార్చి 31 : మండలంలోని గిరిగామ, అట్నంగూడ, లింగూడ గ్రామాలకు మిషన్ భగీరథ జలం నాలుగు రోజులుగా సరఫరా కావడం లేదు. భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లలో నీరు ఇంకిపోయి గిరిపుత్రులు అష్ట క ష్టాలు పడుతున్నారు. ఇటీవల తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామస్తులు కలెక్టర్ రాజర్షి షాకు తమ నీటి సమస్యను పరిష్కరించాలని విన్నవించుకున్నారు.
కలెక్టర్ సంబ ంధిత అధికారులకు భగీరథ సమస్యలను పరిష్కరించి అన్ని గ్రామాలకు నీరు అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశా రు. అయినా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. వారంలో రెండు రోజులు మాత్రమే నీరు వస్తుందని, నీటి కష్టాలను తీర్చాలని అడవిబిడ్డలు వేడుకుంటున్నారు.