రోడ్డు దాటుతుంటే ఎవరిదో మొరటుగా వచ్చిన బండి నన్ను కొట్టుకొని వెళ్ళిపోయింది కళ్ళు భైర్లు కమ్మాయి ఎముకలేమీ విరిగి పోలేదు కలలేవీ చెదిరి పోలేదు చేతులకూ కాళ్ళకూమృగాలు మీద పడ్డట్టు కొన్ని గాయాలయ్యాయి.
‘మందు మంచిగెయిరా.. కింద ఎగజల్లకు’ మక్కకు మందేస్తున్న నా మీదికి నాల్కె మర్రేసింది అజ్జిరవ్వ. ‘పోరని దిక్కు జూసింది మా సాలుగని నువ్వయితే ఈ తట్టల మందు వోస్కరాపో..’ నా మీదికి గుర్కాయించి సూత్తున్న అజ్జిరవ్వ చ