కాలం రూపు మారింది
సాయం సమసిపోయింది
గంజి, గటుక, నిప్పు, పప్పు
తాబదళ్ళ కలగలుపు జీవితాలన్నీ
కనుమరుగైన మెరుగు దివ్వెలు
పైసా పరక పారేసి
పక్కోడి ప్రాణం నిలపెట్టే గుణం
చూపు కందని శూన్యం
సంచారకుల, శారదగాళ్ళ సంబురాలు
కళ్లగంతల కవాటాలు
ఒర్రె నీటిలో బోకి తానమాడి
పక్కింటికి పంపిన
ఉలిసెకొక్కుల మసాల పులుసులు
పల్లెల్లో సైతం నల్లపూసలే
కల్లంలో కొలతబుడ్డి చూసి
నోరు తెరిసే జోలెలు
మొగురం చాటు పిట్టగూడుకు
వరిగొలుసు తోరణాలు
అగుపడని అమాస వెన్నెలలు
పిల్లకాకికి పిడిసె డన్నమేసె
రంగవ్వ బంగారు గుణం
నూతిలో జారిపడిన రత్నం
ఆ కాలం కరువైనదే
కానీ.. కడుపులన్ని చల్లనివి
మెతుకు మెతుక్కు లెక్కకట్టి
సాటి మనిషిని
నేల అడుక్కు నెట్టేసే
నేటి కరకు రోజులు మాత్రం కావు
-వూట్ల భద్రయ్య
95502 56840