ముంబై : దవాఖానల్లో వైద్య సామగ్రి కొనుగోలు ధరలకు, వాటిపై ముద్రించిన గరిష్ఠ చిల్లర ధరలకు(ఎంఆర్పీ) మధ్య భారీ వ్యత్యాసాలు ఉండటంపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) కమిషనర్ తుకారాం ముండే ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముండే తెలిపిన వివరాల ప్రకారం ఓ ప్రైవేట్ దవాఖాన ఐవీ సెట్‌ను రూ.11.05కు కొనుగోలు చేయగా, దాని ఎంఆర్పీ రూ.325గా ఉంది. అదేవిధంగా రూ. 6.75కు కొనుగోలు చేసిన సిరంజీ ఎంఆర్పీ రూ.57.20గా ఉంది. రూ. 29.41కి కొనుగోలు చేసిన కాథెటర్ ఎంఆర్పీ రూ. 310గా ఉంది.