వెలుగు రేఖలు
చీకటి తెరలను తెంపుతూ అజ్ఞానాంధకారాన్ని వైదొలిగిస్తూ వెలుగు రేఖలు కొన్ని మస్తిష్కపు మలినాన్ని శుద్ధ్ది చేస్తాయి
చీకటి తెరలను తెంపుతూ
అజ్ఞానాంధకారాన్ని వైదొలిగిస్తూ
వెలుగు రేఖలు కొన్ని
మస్తిష్కపు మలినాన్ని శుద్ధ్ది చేస్తాయి
ఆలోచనల పరంపరలో
నిర్ణయాత్మక భావాన్ని నిలకడ చేసి
సన్మార్గం వైపు నడిపిస్తాయి
సహనంతో సావాసం చేయిస్తూ
నిర్మలత్వానికి స్ఫూర్తి రేఖలౌతాయి
ఆ వెలుగు రేఖల వెలుతురులో
ముసిరిన మబ్భుల మూఢత్వంపై
విజ్ఞత చలువదనాన్ని తెప్పిస్తాయి
వెలుగులో నడిపిస్తూనే
మస్తిష్కాన్ని వెలిగిస్తూ
కండ్లను తెరిపిస్తుంటాయి
వెలుగంటే కంటికి కనిపించే
సహజమైన ప్రకృతి కాదు
లోపాల్ని కొలిచే
నిర్ధిష్టమైన కొలబద్ద
ఆ కాంతి రేఖలు
సమగ్రతకు రూపాన్నిస్తాయి
అసమానతల్ని తొలిగించే
తీర్పు ఔతాయి
అక్షరాలుగా పరిణమిస్తూనే
సులక్షతకు పట్టం కడతాయి
కాంతి రేఖలుగా విస్తరిస్తూనే
ఉషస్సుకు ప్రతీకలౌతాయి
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
పలువురికి బానోత్ మనీషా లక్ష్మి పరామర్శ
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
BRS | మాజీ ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన యువత
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

