నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఫిబ్రవరి 10: మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో అధికార కాంగ్రెస్ నేతలు బరితెగించారు. పంచాయతీ ఎన్నికల్లో దెబ్బతిన్నామని, ఈ ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలని అడ్డదారులన్నీ తొ క్కుతున్నారు. నామినేషన్ల దాఖలు మొదలు పోలింగ్ వరకూ అన్ని రకాలుగా ఉల్లంఘనల కు పాల్పడుతున్నారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ నాయకులు అ డుగడుగునా అధికారాన్ని దుర్వినియోగం చే స్తున్నారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను బెదిరించడమే గాక దాడులకూ తెగబడుతున్నారు. చట్టాన్ని లెక్కలేకుండా.. తాము చెప్పిందే వే దం అన్నట్టు నడుచుకుంటున్నారు. ఇంత జ రుగుతున్నా అధికారులు, పోలీసులు కిమ్మన డం లేదు. మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రా రంభం కావాల్సి ఉండగా ప్రలోభాలను ము మ్మరం చేశారు. డబ్బులు పంచడమే గాక.. స మావేశాలు నిర్వహించడం, ప్రత్యర్థులను బెదిరించిన ఘటనలు చోటుచేసుకున్నాయి.

ధర్మపురిలో కాన్వాయ్‌తో మంత్రి లక్ష్మణ్
జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంత్రి లక్ష్మణ్‌కుమార్ హల్చల్ చేశారని సోషల్ మీడియా లో ఓ పోస్టు మంగళవారం వైరల్ అయ్యింది. తెల్లవారితే పోలింగ్ ఉండగా, లక్ష్మణ్‌కుమార్ తన అధికారిక కాన్వాయ్‌లో ధర్మపురిలో చక్క ర్లు కొట్టారంటూ పెట్టిన వీడియోలు చర్చనీయాంశమయ్యాయి. ధర్మపురిలోని బ్రాహ్మణ సంఘ భవనంలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మంత్రి తన కాన్వాయ్‌లో బయలుదేరా రు. నిబంధనలకు విరుద్ధంగా తిరగడం, ప్రజలను ప్రభావితం చేయడం, కోడ్‌ను ఉల్లంఘించడమేనని యువత ట్రోల్ చేస్తున్నారు. తాను కోడ్ ఉల్లంఘించలేదని మంత్రి తెలిపారు. ఇటీవల మేడారంలో జరిగిన ఘటన నేపథ్యంలో పోలీసులు భద్రతాపరమైన చ ర్యలు తీసుకున్నారని చెప్పుకొచ్చారు.
సదాశివపేటలో మహిళకు లక్ష నజరానా
సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బాహాటంగానే నగదు పంపిణీ చేశా రు. సదాశివపేటలో మంగళవారం ఉదయం 8గంటల నుంచి పలువార్డుల్లో ఓటర్లను కలుసుకుని వారిని ప్రభావితం చేసే ప్రయత్నం చే శారు. ఓ హోటల్ వద్ద టిఫిన్ చేస్తుండగా పెద్ద సంఖ్యలో అక్కడికి జనం వచ్చారు. కోడ్‌ను ఉల్లంఘిస్తూ జగ్గారెడ్డి ప్రజలకు డబ్బులు పంపిణీ చేశారు. పోలీసులు వచ్చి ఆయన్ను అక్కడినుంచి పంపించేశారు. సంగారెడ్డికి చేరుకున్న జగ్గారెడ్డి బైక్‌పై పలువార్డుల్లో పర్యటిస్తూ ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. పాతబస్టాండ్ వద్ద ఓ మోచీతో మాట్లాడి అతనికి రూ.50వేలు నగదు ఇచ్చారు. పట్టణంలో పలువురికి డబ్బులు పంపిణీ చేశారు. సదాశివపేటలో సోడా అమ్ముకునే మహిళకు లక్ష రూపాయలు ఇచ్చారు. జగ్గారెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.
బీఆర్ఎస్ నాయకులపై అట్రాసిటీ కేసు
మెదక్‌లో సోమవారం రాత్రి కాంగ్రెస్ నా యకులు ఓటర్లకు మద్యం, డబ్బులు పంపిణీ చేయగా, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్గౌడ్తోపాటు బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. తమ ఇంటిపైన దాడి చేశారని ఓ ఎస్సీ మహిళతో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయించగా, పోలీసులు విచారణ చేయకుండానే అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అంతేగాక మాజీ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్‌ను పోలీసులు గృహ నిర్బం ధం చేశారు. సోమవారం రాత్రి ఆయన ఇంటి పై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. ఆ సమయంలో న్యాయవాది జీవన్రావుతోపాటు కొందరు అక్కడ లేకపోయినా వారిపై కేసులు నమోదుచేశారు. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులను నిరసిస్తూ మంగళవారం మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎ మ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకు లు అదనపు కలెక్టర్ నగేశ్‌కు ఫిర్యాదు చేశారు.

మెదక్‌లో ఎమ్మెల్యే బెదిరింపులు..
సోమవారం రాత్రి మెదక్ పట్టణంలో నం బర్ లేని బైక్‌లు, కార్లపై ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు, అనుచరులు, రౌడీలతో తిరుగుతూ బీఆర్ఎస్ నాయకులను బెదిరించారు. 15వ వార్డు బీ ఆర్ఎస్ కార్యకర్త బత్తుల ప్రసాద్‌ను కాంగ్రెస్ లో చేరాలని ఒత్తిడి చేశారు. అతను ససేమిరా అనడంతో.. ఎమ్మెల్యే కారుతో అతడి బైక్‌ను ఢీకొట్టినట్టు బీఆర్ఎస్ నాయకులు ఆరోపించా రు. ప్రసాద్‌కు గాయాలు కావడంతో మెదక్ దవాఖానలో చేరినట్టు తెలిపారు. ఎమ్మెల్యేపై డీఎస్పీకి ఫిర్యాదు చేసినా కేసు నమోదుచేయలేదు. కాగా రామాయంపేట, మెదక్ పట్టణాల్లో ఎమ్మెల్యే రోహిత్, అతని తండ్రి, మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌రావు సోమవారం రాత్రి కాంగ్రెస్ నేతలు, అనుచురులు తిరుగుతూ ప్రతిపక్ష నేతలు, అభ్యర్థులను భయపెట్టారు. విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారు.
మంత్రి అడ్లూరి కోడ్ ఉల్లంఘన
ధర్మపురిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమా ర్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ కా న్వాయ్లో యథేచ్ఛగా తిరుగుతూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని రాష్ట్ర ఎన్నికల సం ఘానికి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఫోన్లో ఫిర్యాదు చేశారు. కోడ్‌ను ఉల్లంఘించిన మంత్రిపై వెంటనే చట్ట ప్రకారం చర్యలు తీసుకొని ప్రచారం చేయ కుండా కట్టడి చేయాలని కోరారు.
ఎమ్మెల్యేలు ఇలా..
వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, కాంగ్రెస్ నాయకులు మంగళవారం కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి ఇంట్లో ప్రెస్‌మీట్ పెట్టి హామీలు గుప్పించారు. ఆ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గోధుమ మధుసూదన్ మంగళవా రం సాయంత్రం ఎన్నికల అధికారికి ఫి ర్యాదు చేశారు. గద్వాల జిల్లాకేంద్రంలోని ఆయా వార్డుల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సమావేశాలు నిర్వహించి ఓటర్లను ప్రభావితం చేసినట్టు స మాచారం. కృష్ణారోడ్డులోని ఓ అపార్ట్మెంట్లో సమావేశమై ఓటర్లను ప్రభావితం చేశారని చర్చ నడుస్తున్నది.
బీఆర్ఎస్ అభ్యర్థిపై దాడి
వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలోని 2వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నల్లగొండ శ్రీనివాసులు తరఫున కార్యకర్త లు కరపత్రాలతో నేతాజీనగర్‌లో చేయి గుర్తుకు ఓటు వేయాలని ఇంటింటా ప్రచారం చేశారు. అదే సమయంలో బీ ఆర్ఎస్ అభ్యర్థి జయరాం నాయక్ స్కూ టీపై వెళ్తూ కాంగ్రెస్ ప్రచారాన్ని సెల్ ఫో న్లో రికార్డ్ చేశారు. దీన్ని గమనించి న కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసులు బంధు వు, గ్రామీణ బ్యాంకు ఉద్యోగి శ్రీనివాసు లు తన బైక్‌తో జయరాం స్కూటీని వె నుక నుంచి ఢీకొట్టాడు. ఈ ఘటనలో జయరాం స్వల్పంగా గాయపడ్డారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని గడిబురుజుల సమీపంలో ఎన్నికల ఫ్లయింగ్ స్కాడ్ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ప్రయాణిస్తు న్న కారును తనిఖీ చేయగా రూ.60వేల నగదు లభించినట్టు తెలిపారు.
హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం హల్చల్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం రాత్రి రోడ్డు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హల్చల్ చేశారు. ఓ ప్రైవేట్ వాహనంలో తిరుగుతూ ఎక్కడ నలుగురు కనిపిస్తే అక్కడ ఆగి.. ‘నేను మంత్రిగా చెప్తున్నా.. కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయండి’ అంటూ వేడుకున్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఎస్కార్ట్‌ను దూరంగా ఉంచి మంత్రి స్వయంగా కొందరి ఇండ్లకు వెళ్లి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. కొందరు బీఆర్ఎస్ నాయకులను ఫోన్లో బెదిరించినట్టు సమాచారం. మంత్రి పొన్నం నిబంధనలు అతిక్రమించారని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. కాగా మంత్రి పొన్నం హుస్నాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థుల ఇండ్లకు పోలీసులను పంపి భయభ్రాంతులకు గురిచేసినట్టు తెలిసింది. ఓ అభ్యర్థి ఇంట్లోకి పోలీసులు వెళ్లి సోదాలు చేసేందుకు ప్రయత్నించగా వారు తీవ్రంగా వ్యతిరేకించడంతో వెళ్లిపోయారు.