జలస్వప్నం
రాళ్ళు రప్పలు మొకం కడుక్కొని దమ్మార నీళ్లను తాగిన దినమే అడ్వికి తొలుసురు పండుగ
రాళ్ళు రప్పలు మొకం కడుక్కొని
దమ్మార నీళ్లను తాగిన దినమే
అడ్వికి తొలుసురు పండుగ
కొంగలు, పిట్టలు, దుప్పులు
ఏ తొవ్వపొంటి
వాళ్ల సుట్టాలను దేవులాడుకుంటపోయినా
నీళ్లు తోడున్ననాడే
వనమల్ల పచ్చని సంతకమైతది
పసురాలకు పోరలకు
ఊరవిస్కలకు ఉల్లింతపండ్లకు
అడ్విజీవాలకు ఆకలికూనలకు
డొంగువాగు కన్నతైల్లె ఆటవెడ్తది
నీళ్లతీగ పారిన్నాడే
కన్నీళ్ల సెలిమలు కప్పుకపోతయి
ఇన్ని దినాలు
నీళ్లులేక ఎన్ని కన్నీళ్లతో
పల్లెలు మొకం కడుక్కున్నయో
తలాపున కృష్ణమ్మతల్లి పారుతున్న
తెలంగాణ నోట్ల
కష్కడు నీళ్ళు ఎత్తిపొయ్యలేరు
నీళ్ల నిర్వచనం తెల్వనోళ్లు
వలస పచ్చులను జేసి
సెట్టుకొక్కరిని పుట్టకొక్కరిని
ఇనాం ఇచ్చిండ్రు
ఎద పాదునిండ తడి ఉంటేనే మనిషైనా, చట్టైనా
మనసువిప్పి మాట్లాడుతరు
లేకుంటే.. ఎండిన నేలన
నడిజాము నెలవంక అందాలను
బోసిపోయిన ఏ ఊరి ముందు
పారబోసి మాట్లాడాలి.
తడి సప్పుడు లేకుంటే ఏ పల్లె పొలిమెరైనా
దుఃఖపు నీళ్లతో పుదిచ్చిన
రైతు నీడనే కనిపిస్తది
నీళ్ళుంటేనే పండుగ లేకుంటే దండుగ
ఇయ్యాల నీళ్ళు కట్లు దెంపుకున్నయి
దశాబ్దాల జలస్వప్నం
కండ్లముందరొచ్చి నిలబడింది
బీడు భూములకు తలార తానం బోస్తుంది
పాలనంటే… పాలజొన్న కంకుల దూప తీర్చడమే
పరిపాలనంటే .. పిడ్సగట్టిన నాలుకల మీద
తేనె సుక్కల జలపాతాలను కురిపించడమే
దేశం ఆకలి తీర్చే బువ్వముద్దల సద్దిమూటకు
ఆరుగాలం జలరాసుల కుప్పను వాగ్దానమివ్వటమే..
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. పది మంది మృతి
‘ప్రభుత్వానికి పట్టభద్రులు బుద్ధి చెప్పాలి’
Rajkumar Periyasamy | అది సీక్వెల్ కాదు, అక్కడితోనే క్లోజ్.. ధనుష్ ‘ఓం’ సినిమాపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
Srinivas Goud | రైతాంగానికి ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం చెల్లించాలి: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
KTR | పబ్లిక్ గొంతు నొక్కడం ఏ రకమైన పబ్లిక్ హియరింగ్ అవుతుంది : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

