చుడువా వాలా
రోడ్డు దాటుతుంటే ఎవరిదో మొరటుగా వచ్చిన బండి నన్ను కొట్టుకొని వెళ్ళిపోయింది కళ్ళు భైర్లు కమ్మాయి ఎముకలేమీ విరిగి పోలేదు కలలేవీ చెదిరి పోలేదు చేతులకూ కాళ్ళకూమృగాలు మీద పడ్డట్టు కొన్ని గాయాలయ్యాయి.
రోడ్డు దాటుతుంటే ఎవరిదో మొరటుగా వచ్చిన బండి నన్ను కొట్టుకొని వెళ్ళిపోయింది కళ్ళు భైర్లు కమ్మాయి ఎముకలేమీ విరిగి పోలేదు కలలేవీ చెదిరి పోలేదు చేతులకూ కాళ్ళకూమృగాలు మీద పడ్డట్టు కొన్ని గాయాలయ్యాయి
ఫర్వా లేదు ప్రాణం మిగిలింది భుజం మీద కేను కుర్చీ లాంటి స్టాండు మోసుకొంటూ తల మీద చుడువా బుట్ట పెట్టు కొని పార్కులూ బస్టాండులూ తిరుగు తాను కారం కారం మర మరాలు లేమన్ లేమన్ ప్యాజ్ మిక్చర్లు మసాలా మజాలు చల్లిన పల్లీలు చెన్నా బఠానీ గుగ్గిళ్ళు సామాన్య జనాలకు అమ్ము కొంటాను సగం సగం ఆకలి తీర్చి సంపూర్ణంగా సత్తువ పెరిగే ఉషారు నిస్తాను
ఎన్ని చోట్లకు వెంట బడి తిరుగుతే ఎందరు కొంటారో ఎట్లబడితే అట్లా విసుక్కొంటారో అంతా భరించి జోకులో జోకు కలిపి నవ్వుతూ నవ్వించి నోరూరించాలి కొందరు మాట్లాడు తున్నట్టు నమ్మించి నాలుగు బఠానీలు నోట్లో వేసుకొంటారు మసాలా కలిసిందా లేదాని చిరాకు కలిగేలా వేలితో కెలుకు తారు
కొనేది లేదు నన్ను పోనిచ్చేది లేదు సతాయింపును సరదాగా తీసుకొని అల్లుకపోయి అందరితో కలిసి పోతేనే నా కడుపు నిండే బేరం దొరికేది మైళ్ళకు మైళ్ళు నడిచి దారిలో చీకటి పడుతుంది అమ్మీ అమ్మని ఆశలతో దొరికీ దొరకని కలలతో ఇల్లు చేరే సరికి నిట్టూర్పు మిగులు తుంది పూలులేని తోటమీద పరిమళం లేని గాలి వీస్తుంది ఆకాశంలో ప్రయాణికుల గుంపులా తారలు కళ్ళల్లో వేకువ రేపే సువాసనలు అవీ ఇవీ ఎగిరే సీతా కోక చిలుకల్లా మెరిసి రేపటి దినం మీద మళ్ళీ ప్రాణం లాగు తుంది
– ఆశారాజు 93923 02245
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

