ఇసుక మీద రాసిన అక్షరాలా అవి
తుడిస్తే తుడిచి పెట్టుకపోవడానికి?
నీటి మీద గీసిన గీతలా అవి
ఒక్క గాలితో కొట్టుకుపోవడానికి?
అవి మనసుపై ముద్రించిన శిలాక్షరాలు!
గుండెపై గుదిబండతో రాసిన రక్తాక్షరాలు!!
కుకీలో, మొయితీలో…
ఒక జాతిపై ఇంకొక జాతి ఝళిపించిన
క్రూర అకృత్యపు కొరడా చేదు గుర్తులు!
వారి గొంతుల నుంచి వినబడుతున్నవి
మణిపురీ గేయాలు కాదు
గుండెకు చేసిన ఛిద్రాల గాయాల హోరు!
అవి రాజదండపు అధికార దర్పణం క్రీనీడలో
లిఖించిన మరణ శాసనాలు!
-వేణు నక్షత్రం