ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) నిర్వహణా పగ్గాల్ని ప్రైవేటు రంగానికి చెందిన వ్యక్తికి అప్పగించడానికి రంగం సిద్ధమవుతున్నది.
ఎవరూ ఖాళీ కడుపుతో నిద్రించకూడదన్నది మన సంప్రదాయమని, దేశంలోని చివరి వ్యక్తి వరకూ ఆహార ధాన్యాలను చేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, రాష్ర్టాలకు నిధుల నిలిపివేత, ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర సమస్యలపై పార్లమెంట్లో చర్చించాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతు ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని అఖిల భారత కిసాన్‌సభ జాతీయ కార్యదర్శి కృష్ణప్రసాద్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.
అన్నం పెట్టే రైతుకు ఆసరాగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల ధరల పెంపుతో అన్నదాతల నడ్డి విరిచింది. డీజిల్ ధరలను అడ్డగోలుగా పెంచి రైతులను మరింత కుంగదీసింది.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన 15 ఏండ్లు దాటిన వాహనాలను వినియోగం నుంచి ఉపసంహరించుకొని, స్క్రాప్(తుక్కు)కు పంపిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీల అమలు, అటవీ సంరక్షణ నియమాల ఉపసంహరణను డిమాండ్ చేస్తూ రైతులు, ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో 26న చలో రాజ్‌భవన్ నిర్వహించనున్నారు.
ఆస్తుల నగదీకరణ పేరు చెప్పి.. దేశంలోని 13 మేజర్ ఓడరేవులను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం మేజర్ పోర్ట్స్ అథారిటీస్ యాక్ట్, 2021ని అమల్లోకి తెచ్చింది.