Rohit Sharma | కొబ్బరి బోండంపై రోహిత్ బొమ్మ.. అభిమాని ప్రతిభకు హ్యాట్సాఫ్..!
Rohit Sharma : భారత జట్టు విధ్వంసక ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు అభిమానగణం ఎక్కువే. వచ్చే వన్డేప్రపంచకప్ ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ మాజీ సారథిపై తనకున్న అభిమానాన్ని ఒక యువకుడు వినూత్నంగా చాటుకున్నాడు.
Rohit Sharma : భారత జట్టు విధ్వంసక ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు అభిమానగణం ఎక్కువే. తనమార్క్ షాట్లతో అలరించే హిట్‌మ్యాన్ భారీ సిక్సర్లు, ఫుల్‌షాట్లు కొడుతుంటే స్టేడియం దద్దరిల్లిపోవాల్సిందే. వచ్చే వన్డేప్రపంచకప్ ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ మాజీ సారథిపై తనకున్న అభిమానాన్ని ఒక యువకుడు వినూత్నంగా చాటుకున్నాడు. ఏకంగా కొబ్బరి బోండంపై టీమిండియా స్టార్ బొమ్మను చాలా నేర్పుగా చెక్కాడు. ప్రస్తుతం ‘కోకోనట్ రోహిత్’ వీడియో నెట్టింట వైరలవుతోంది.
అభిమాన క్రికెటర్లపై ప్రేమను ఒక్కొక్కరు ఒక్కోవిధంగా వ్యక్తం చేస్తుంటారు. గతంలో ఒక కుర్రాడు క్యూబిక్ రూబ్స్తో పేసర్ మహమ్మద్ షమీ బొమ్మకు రూపమిచ్చాడు. ఇప్పుడు రోహిత్ శర్మ అభిమాని ఒకరు కొబ్బరి బోండంపై తన కళా ప్రావీణ్యాన్ని చూపించాడు. పొడవాటి కొబ్బరి బోండం పైభాగాన్ని హిట్‌మ్యాన్ రూపం వచ్చేలా తొలిచాడు.
Coconut sculpture art of Rohit Sharma made by a fan. 🥹 pic.twitter.com/5Fnj0tnEuQ
— Selfless⁴⁵ (@SelflessCricket) January 18, 2026
చిన్న కత్తితో అతడు ఎంతో నేర్పుగా.. రోహిత్ చిత్రాన్ని ఆవిష్కరించాడు. తలపై టోపీగా కొబ్బరి బోండం భాగాన్నే మలిచిన తీరు అభిమానులను అబ్బురపరుస్తోంది. సెల్ఫ్‌లెస్ అనే ఎక్స్ యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. కోకోనట్ రోహిత్ అపురూపమైన చిత్రాన్ని చూసిన వారంతా ఈ కుర్రాడి ప్రతిభను కొనియాడుతున్నారు.
3 మ్యాచుల్లో 61 రన్స్
నిరుడు టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్.. ప్రస్తుతం వన్డేల్లోనే కొనసాగుతున్నాడు. సిడ్నీ వన్డేలో అజేయ శతకంతో చెలరేగిన అతడు.. స్వదేశంలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సిరీస్‌లో పెద్దగా రాణించలేదు. కివీస్‌పై మూడు మ్యాచుల్లో ఈ విధ్వంసక బ్యాటర్ 61 రన్స్ చేశాడంతే. దాంతో.. హిట్‌మ్యాన్‌కు వన్డే ప్రపంచకప్ అవకాశం ఇస్తారా? లేదా? అనేది ఆసక్తి రేపుతోంది.
This is how Rohit Sharma chased 91 runs in 8 overs against Aus Hazelwood and Starc
That one bad Series can’t decide Legacy of Greatest Opener pic.twitter.com/C0Y4vxpka3
— RUC×H (@deAtHx__00) January 19, 2026
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

