Rare birds : హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రం కాంగ్రాలోని పాంగాంగ్ సరస్సు (Pangond lake) ఏటా వలస పక్షులతో కళకళలాడుతుంది. సైబీరియాకు చెందిన బార్-హెడెడ్ గూస్ పక్షులు ప్రతి ఏడాది శీతాకాలంలో ఇక్కడ పక్షి ప్రేమికులకు కనువిందు చేస్తాయి. అయితే ఈసారి గూస్ బర్డ్స్తోపాటు రెండు అరుదైన జాతుల పక్షులు ఇక్కడ దర్శనమిచ్చాయి.
పక్షి ప్రేమికులు వాటిని చూసి ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. వాటి గురించి వన్యప్రాణి సంరక్షణ అధికారులకు సమాచారం అందించారు. అయితే ఆ పక్షులు ఏ జాతికి చెందినవి..? ఎక్కడి నుంచి వలస వచ్చాయి..? అనే వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. ఈ రెండు రకాల పక్షులు పాంగాంగ్ సరస్సుకు రావడం ఇదే తొలిసారని తెలిపారు.