ప్రచారం: దేశంలో ఏ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనైనా ద్విచక్ర వాహనాలు నడిపేవాళ్లు హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాల్సిన అవసరం లేదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. హైవేలపై ప్రయాణిస్తున్నప్పుడే హెల్మెట్ అవసరం.
వాస్తవం: ఇది తప్పుడు ప్రచారం. కావాలనే కొందరు సోషల్ మీడియాలో ఇలా ప్రచారం చేస్తున్నారు. హెల్మెట్ తప్పనిసరి కాదని కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ద్విచక్ర వాహనాలపై వెళ్లే వాళ్లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.