కాంగ్రెస్ పార్టీకి పాలన చేతగాక రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతుందని.. డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపుతుందని బీఆర్ఎస్ నేతలు కన్నెర్ర చేస్తున్నారు. కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముమ్మాటికీ ఇది కక్ష సాధింపు చర్యేనని.. అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. నోటీసులెన్ని ఇచ్చినా సర్కారు తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ భయపడదన్నారు. నోటీసులు ఎన్ని ఇచ్చినా అదిరేది,బెదిరేది లేదని తెలిపారు.
కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం సర్కార్ చేతగాని తనానికి నిదర్శనం.. పాలన చేతగాక రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతుంది. ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపుతుంది. నాడు పంచాయతీ ఎన్నికలప్పుడు కేటీఆర్‌కు నోటీసులు, నేడు మున్సిపాలిటీ ఎన్నికలు ఉండగా హరీశ్ రావు ,కేటీఆర్‌లకు నోటీసులు ఇవ్వడం విడ్డూరం. రేవంత్ సర్కార్ ఆడించినట్లు పోలీస్ యంత్రాంగం ఆడుతుంది. ఎన్ని కేసులు, నోటీసులు ఇచ్చినా న్యాయపరంగా ఎదుర్కొంటాం.
మోసపూరిత హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లలో ప్రజలకు చేసిందేమి లేదు.. పాలనను వదిలేసి ప్రజల పక్షాన నిలబడుతున్న ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. బొగ్గు కుంభకోణం బయటపెట్టిన 24 గంటల్లోనే మాజీ మంత్రి హరీశ్‌రావుకు సిట్ నోటీసులు ఇచ్చి విచారించిందని, ఇప్పుడు కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడం ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యే. ముఖ్య మంత్రి దావోస్ పర్యటనలో ఉండగా రాష్ట్రంలో సిట్ విచారణలు, అక్రమ అ రెస్టులు చేయడం తగదు. అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని, నోటీసులెన్ని ఇచ్చినా రేవంత్‌రెడ్డి సర్కారు తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ భయపడదని, ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసే దాకా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం.
-బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి సతీశ్‌రావు