బీఆర్ఎస్లో చేరికల జోరు.. భారీగా కాంగ్రెస్, బీజేపీ నేతల చేరిక
బీఆర్ఎస్లో చేరికల జోరు ఊపందుకుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతలపల్లి, ఎల్లంపేట్, అలియాబాద్ మున్సిపాలిటీల్లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్లో వివిధ పార్టీల నేతలు చేరుతున్నారు. హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు.
- పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి
మేడ్చల్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్లో చేరికల జోరు ఊపందుకుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతలపల్లి, ఎల్లంపేట్, అలియాబాద్ మున్సిపాలిటీల్లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్లో వివిధ పార్టీల నేతలు చేరుతున్నారు. హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి సమక్షంలో మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలైన స్వప్న, నరేశ్, శ్రవణ్‌రెడ్డి, వెంకటేశ్‌గౌడ్, స్వామిలతో పాటు 30 మంది కార్యకర్తలు, ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధు, నరేశ్‌లతో పాటు 25 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరగా ఎమ్మెల్యే మల్లారెడ్డి వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న దృష్ట్యా ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు వెనకాడుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతాం
మూడు మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతాం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయలేదు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు, మహిళలు మండిపడుతున్నారు. ఎన్నికలు ఏవైనా బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని ప్రజలు అనుకుంటున్నారు. మూడు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్
గెలుపు తధ్యం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- BJP
- BRS
- Congress
- Mla Mallareddy
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

