తమ కాలనీలో పార్కు కోసం కేటాయించిన స్థలంలో తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలు ఏర్పాటు చేయవద్దని మచ్చబొల్లారం డివిజన్ ఫాదర్ బాల్లయ్యనగర్ కాలనీవాసులు డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం అల్వాల్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. గతంలో తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటుపై కోర్టుకు వెళ్లామన్నారు.
కేసు కోర్టు పరిధిలో ఉన్న తరణంలో ప్రస్తుతం ఆర్డీవో కార్యాలయం కోసం ఏర్పాట్లు జరుగుతుండడంతో కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల కోసం కేటాయించిన ఆట స్థలాలను ప్రభుత్వ కార్యాలయాలుగా మారిస్తే పిల్లలు ఎక్కడ ఆడుకోవాలని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వ కార్యాలయాలను తమ కాలనీ నుంచి తరలించాలని ప్రభుత్వానికి విన్నవించారు. – అల్వాల్ జనవరి 22