హైదరాబాద్, మార్చి 13(నమస్తే తెలంగాణ) : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంలో ఎలాంటి మార్పూలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం రాజ్యసభలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు చేస్తున్న ఆందోళన గురించి తెలుసని వెల్లడించింది. ఉద్యోగ సంఘాలతో ప్లాంట్ యాజమాన్యం చర్చిస్తున్నదని తెలిపింది. ఉద్యోగుల ఆందోళనల దృష్ట్యా నిర్ణయం మార్చుకుంటారా, లేదా? అని కనకమేడల ప్రశ్నించగా.. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃపరిశీలించే ప్రతిపాదనేదీ లేదని కేంద్రం తేల్చిచెప్పింది.