బాగ్దాద్: ఇరాక్ సముద్ర జలాల సమీపంలో అమెరికాకు చెందిన ఆయిల్ ట్యాంకర్‌ను సూసైడ్ బోట్(Underwater Drone Attack) ద్వారా ఇరాన్ పేల్చివేసింది. చమురు ట్యాంకర్‌పై అండర్ వాటర్ డ్రోన్ అటాక్ జరిగిన ఘటనలో ఓ భారతీయ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆయిల్ ట్యాంకర్ సేఫ్సీ విష్ణుపై ఇరాన్ అటాక్ చేసింది. ఇరాన్ ఆధీన జలాల్లో ఉన్న ఖోర్ అల్ జుబైర్ పోర్టు వద్ద ఈ దాడి జరిగింది. హోర్ముజ్ జలసంధి నుంచి వెళ్లే ప్రతి ఇంధన ట్యాంకర్‌ను పేల్చివేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ఇంధన నౌకలో ఉన్న మరో 15 మంది భారతీయ సిబ్బందిని సురక్షితంగా తరలించారు.
బాగ్దాద్‌లోని భారతీయ ఎంబసీ ఈ విషయాన్ని పేర్కొన్నది. ఆ దాడికి పాల్పడింది తామే అని ఇరాన్ బాధ్యత ప్రకటించింది. పెర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో తాజాగా రెండు ఆయిల్ ట్యాంకర్లను అండర్‌వాటర్ డ్రోన్ అటాక్‌తో పేల్చినట్లు ఇరాన్ వెల్లడించింది. సేఫ్సీ విష్ణుతో పాటు జెఫిరోస్ నౌకలను ఇరాన్ అటాక్ చేసింది. అమెరికాకు చెందిన సేఫ్సీ ట్రాన్స్పోర్ట్ కంపెనీ సేఫ్సీ విష్ణు నౌక చెందింది. ఇరాక్‌లోని అధికారులు, భారతీయ నావికులతో నిత్యం టచ్‌లో ఉన్నట్లు భారతీయ ఎంబసీ పేర్కొన్నది.