(Vengamamba memorial) చిత్తూరు: తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ సజీవ సమాధి ఉన్న స్థలాన్ని అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలిసి టీటీడీ కార్యనిర్వహణాధికారి కేఎస్ జవహర్‌రెడ్డి పరిశీలించారు. 19వ శతాబ్దానికి చెందిన కవయిత్రికి వారు నివాళులర్పించారు. అనంతరం తిరుమలలోని 1.5 ఎకరాల సువిశాల ప్రాంతాన్ని ‘వెంగమాంబ బృందావనం’ (స్మారక చిహ్నం)గా అభివృద్ది చేయనున్నట్లు, యాత్రికులకు మరో ఆకర్షణీయ ప్రదేశంగా తీర్చిదిద్దుతామని ఈఓ తెలిపారు.
తరిగొండ వెంగమాంబ.. చిత్తూరు జిల్లాలోని తరిగొండ గ్రామంలో 1730లో వంగిపురం బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. చిన్ననాటి నుంచి వేంకటేశ్వరుడికి అమితమైన భక్తురాలు. చిన్నవయసులోనే భర్త వేంకటాచలపాహి మరణించిన తర్వాత, తన భర్తగా వేంకటేశ్వరుడిని తీసుకొని పోయేందుకు తిరుమలకు వచ్చి స్వామిని గురించి కఠోర తపస్సు చేస్తుంది. భగవంతుడు వెంకమాంబ భక్తిని అంగీకరించినందున, ఆమె హారతిని ప్రతి రాత్రి స్వామికి చేసే ఏకాంత సేవలో చేర్చారని పురణాలు చెప్తున్నాయి.
తరిగొండ వెంగమాంబ తెలుగులో విష్ణు పారిజాతం, చెంచు నాటకం, రుక్మిణీ నాటకం, జల క్రీడా విలాసం, ముక్తి కాంతి విలాసం, గోపీ నాటకం, రామ పరిణయం, శ్రీ భాగవతం, శ్రీ కృష్ణ మంజరి, తత్వ కీర్తనలు వంటి అనేక పుస్తకాలు రాశారు. 1817లో తిరుమలలో తుది శ్వాస విడిచింది. ఆమె పవిత్ర సమాధి ప్రాంతం అంతా చాలా కాలం పాటు ప్రైవేట్ ఆకర్రమణలో ఉన్నది. ఈ ప్రాంతాన్ని పర్యటకంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ నడుం బిగించడం అభినందనీయం.
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
కొవిడ్ వైరస్ చేరిందో.. ఈ మాస్క్ మెరుస్తుంది! కనిపెట్టిన జపాన్ శాస్త్రవేత్తలు
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..