(Helicopter Crash) చిత్తూరు : తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వారిలో చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి కూడా ఉండటంతో జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్‌తోపాటు 13 మంది చనిపోయారు. మృతుల్లో చిత్తూరు జిల్లా కురబలకోటకు చెందిన సాయితేజ ఉన్నారు. ఆర్మీ అధికారులు సాయితేజ కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో.. ఆయన స్వస్థలం ఎగువ రేగడ గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. సాయితేజకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
రక్షణ శాఖలో 2013 లో చేరిన సాయితేజ.. ప్రస్తుతం లాన్స్ నాయక్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గత కొంతకాలంగా సీడీఎస్ బిపిన్ రావత్‌కు పర్సనల్ సెక్యూరిటీ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇవాళ ఉదయమే భార్యతో ఫోన్లో సాయితేజ మాట్లాడిన క్షేమసమాచారం అందించినట్లు మృతుడి బాబాయి సుదర్శన్ తెలిపారు. చివరిసారిగా గత వినాయకచవితికి స్వగ్రామం ఎగువ రేగడకు వచ్చి వెళ్లినట్లు కుటుంబసభ్యులు గుర్తుచేసుకుంటున్నారు.
గతంలో హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడ్డ రావత్
కాలిపోతున్న హెలిక్యాప్టర్ నుంచి మృతదేహాలు పడటం చూశా..!
బిపిన్ రావత్ కంటే ముందు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ప్రముఖులు వీరే..
వెల్లింగ్టన్తో బిపిన్ రావత్‌కు ఎంతో అవినాభావ సంబంధం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..