ప్రెషర్ కుక్కర్లో వండే అన్నం ఆరోగ్యానికి మంచిదేనా..?
Pressure coocked rice: ప్రెషర్ కుక్కర్లలో అన్నం వండుకుని తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా..? అనేది ఇప్పుడు చాలామందిలో కలుగుతున్న సందేహం. మరి మీకూ అలాంటి సందేహం ఉందా..? మీ సందేహం తీరాలంటే

న్యూఢిల్లీ: మన దేశంలో వరి అన్నమే ప్రధానమైన ఆహారం. దేశంలోని చాలా ప్రాంతాల్లో వరి అన్నాన్ని ఆహారంగా తీసుకుంటారు. సాధారణంగా పొయ్యిమంటపై ఉడికించడం, ఆవిరి పెట్టడం ద్వారా ఈ వరి అన్నాన్ని వండుతారు. అయితే, కాలం మారుతున్నా కొద్దీ అన్నం వండే పద్ధతులు కూడా మారుతున్నాయి. గత కొన్నేండ్లుగా అన్నాన్ని ప్రెషర్ కుక్కర్లో వండటం మొదలుపెట్టారు. ఈ విధానంలో అన్నం వేగంగా, సమర్థంగా ఉడుకుతుండటంతో చాలా మంది ఈ పద్ధతికి అలవాటుపడ్డారు.
ప్రెషర్ కుక్కర్ వంట ఆరోగ్యానికి మంచిదేనా..?
అయితే, ప్రెషర్ కుక్కర్లలో అన్నం వండుకుని తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా..? అనేది ఇప్పుడు చాలామందిలో కలుగుతున్న సందేహం. మరి మీకూ అలాంటి సందేహం ఉందా..? మీ సందేహం తీరాలంటే ఈ వివరాలు చదవండి. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం ప్రెషర్ కుక్కర్లో అన్నం ప్రయోజనకరమేనట. ప్రెషర్‌తో ఉడకడంవల్ల అన్నం రుచిగా కూడా ఉంటుందట. కుక్కర్లో వండిన అన్నంలో పిండిపదార్థం తొలగిపోవడంవల్ల ఫ్యాట్ కంటెంట్ కూడా తక్కువగా ఉంటుందట. ఈ రోజుల్లో ఊబకాయానికి ప్రధాన కారణం పిండిపదార్థమే. ఇదిలావుంటే ప్రెషర్ కుక్కర్లో వండిన అన్నంలో కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్ లాంటి నీటిలో కరిగే పోషకాలు ఉంటాయట.
కుక్కర్లో అన్నంతో ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు..
- ప్రెషర్ కుక్కర్లో వండిన అన్న సులువుగా జీర్ణమవుతుంది.
- ఈ అన్నంలో ప్రోటీన్లు, పిండి పదార్థాలు, ఫైబర్ లాంటి స్థూల పోషకాలు ఉంటాయి.
- ఎక్కువ ప్రెషర్లో ఈ అన్నం వండటంవల్ల బియ్యంలో, నీళ్లలో ఉండే హానికర శిలీంధ్రాలు, బ్యాక్టీరియా నాశనమైపోతాయి.
ఈ విధంగా ప్రెషర్ కుక్కర్లో వండే అన్నంలో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతేగాక వంట వేగంగా సిద్ధమవుతుంది. మంటపై ఎగిరినట్లుగా అన్నం ఎగరకపోవడంవల్ల మెతుకులు ఇరగకుండా ఉంటాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

