తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 16వ తేదీన 15 వేల మందితో సభ నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన తెలంగాణ జాతీయ సమైక్యతా వారోత్సవాలను నల్లబెల్లి మండలవ్యాప్తంగా జయప్రదం చేద్దామని ఎంపీపీ ఊడుగుల సునీతా ప్రవీణ్ పిలుపుని
‘మన ముఖ్యమంత్రి కేసీఆర్ దమ్మున్న నేత.. ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావడం శుభ పరిణామం. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ వల్లే అవుతుంది.’ అంటున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులు.
గోదావరి నది పరవళ్లు తొక్కుతున్నది. రెండు రోజులు కురిసిన వానలకు తోడు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల నుంచి నదికి వరద పోటెత్తుతున్నది. మంగపేట మండలం ఇన్‌టేక్ వెల్ వద్ద 83.5 మీటర్ల ఎతులో ప్రవహిస్తున్నది.
రెండు నుంచి 19 ఏళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మాత్రలు అందించాలని ఎంపీపీ వల్లూరి పద్మావెంకటరెడ్డి అన్నారు. సోమవారం పీహెచ్సీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.
మేడిగడ్డ నుంచి భధ్రాచలం వరకు ముంపు ప్రాంతాలను రక్షించడంలో భాగంగా గోదావరికి కరకట్టను నిర్మించేందుకు రూ.450కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ తెలిపారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని అధికారులను కలెక్టర్ బీ గోపి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలపై సమీక్ష నిర్వహించారు.
తాళం వేసిన ఇండ్లు, దేవాలయాల్లో చోరీలు చేస్తున్న దొంగను గీసుగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను హనుమకొండలోని పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం సీపీ డాక్టర్ తరుణ్‌జోషి వెల్లడించారు.