Students | కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గురుకులాల పరిస్థితి ఎలా ఉందో అద్ధం పట్టే మరో ఘటన ఇది. తమకు పురుగుల అన్నం పెడుతున్నారని నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని గురుకుల పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. జిల్లాలోని వెల్లండ మండల కేంద్రంలో ఉన్న గురుకుల పాఠశాలలో పురుగుల భోజనం పెడుతున్నారంటూ విద్యార్థినులు శ్రీశైలం-హైదరాబాద్ హైవేపై బైఠాయించారు.
ఆందోళన చేస్తున్న క్రమంలో నలుగురు విద్యార్థినులకు అస్వస్థత చోటు చేసుకోవడంతో వారిని వెంటనే స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పాఠశాలలో తమకు మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా పురుగుల అన్నం పెడుతున్నారని.. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. వారిని వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మార్వో, పోలీసులు విద్యార్థినులతో చర్చలు జరిపారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిస్తామన్నారు.
పురుగుల అన్నం పెడుతున్నారని రోడెక్కిన గురుకుల విద్యార్థినులు
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో పురుగుల భోజనం పెడుతున్నారని శ్రీశైలం – హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించిన విద్యార్థినులు
ఆందోళన చేస్తుండగా నలుగురు విద్యార్థినులకు అస్వస్థత.. ప్రైవేట్… pic.twitter.com/pnWgAaNSXA
— Telugu Scribe (@TeluguScribe) February 18, 2026