Yuvraj Singh | వ్యక్తిగత గోప్యతపై యువరాజ్ సింగ్ పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
Yuvraj Singh | వ్యక్తిగత గోప్యతకు సంబంధించి టీమిండియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్, ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్ (Yuvaraj Singh) వేసిన పిటిషన్ (Petetion) పై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) కీలక తీర్పు వెలువరించింది. యువరాజ్ సింగ్ వ్యక్తిగత హక్కులకు, గోప్యతకు భంగం కలిగించవద్దని స్పష్టంచేసింది.
Yuvraj Singh : వ్యక్తిగత గోప్యతకు సంబంధించి టీమిండియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్, ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్ (Yuvaraj Singh) వేసిన పిటిషన్ (Petetion) పై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) కీలక తీర్పు వెలువరించింది. యువరాజ్ సింగ్ వ్యక్తిగత హక్కులకు, గోప్యతకు భంగం కలిగించవద్దని స్పష్టంచేసింది. యువరాజ్ అనుమతి లేకుండా అతడి పేరు, ఫొటోలు, గొంతును వాణిజ్య లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని థర్డ్ పార్టీలను నియంత్రిస్తూ జస్టిస్ జ్యోతి సింగ్ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.
ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో సృష్టించిన డీప్‌ఫేక్ వీడియోలు, వివాదాస్పద ఫొటోలు తన ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నాయని, టీషర్టులు, ఇతర వస్తువులపై తన పేరును అక్రమంగా వాడుకుంటూ వ్యాపారం చేస్తున్నారని యువరాజ్ హైకోర్టును ఆశ్రయించాడు. ఇతర క్రీడాకారులపై దాడి చేస్తున్నట్లు, మతపరమైన భావాలను దెబ్బతీసేలా, అసభ్యకరమైన భాషతో కూడిన డీప్‌ఫేక్ కంటెంట్‌ను సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారని అతడి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ జ్యోతి సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సుదీర్ఘ కాలంపాటు దేశానికి ప్రాతినిధ్యం వహించిన యువరాజ్ ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఆయన కష్టపడి సాధించిన నమ్మకాన్ని, గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. యువరాజ్ ఆమోదం లేకుండా రూపొందించిన అభ్యంతరకర పోస్టులు, వీడియోలను తక్షణమే తొలగించాలని మెటా సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కోర్టు ఆదేశించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

